మైనారిటీ మహిళపై ఎస్సై దాడి చేశారంటూ ఆందోళనలు
పట్టణానికి చెందిన షేక్ ఫర్హ పై అకారణంగా దాడి చేసి గాయపరిచిన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి విధుల్లో నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని జగిత్యాల, కొరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లోలో ముస్లిం సంఘాలు రాస్తారోకో చేపట్టారు.
ఎస్సైని సస్పెండ్ చేయాలంటూ జగిత్యాల, మెట్పల్లి, కొరుట్ల, కొడిమ్యాలలో ధర్నాలు
దిశ, జగిత్యాల ప్రతినిధి : పట్టణానికి చెందిన షేక్ ఫర్హ పై అకారణంగా దాడి చేసి గాయపరిచిన జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి విధుల్లో నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని జగిత్యాల, కొరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లోలో ముస్లిం సంఘాలు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లీం నాయకులు మాట్లాడుతూ.. బెజ్జంకి నుంచి జగిత్యాలకు ఆర్టీసీ బస్సులో వస్తున్న షేక్ ఫర్హా అనే ముస్లిం యువతి ను కూర్చోడానికి బస్సులో సీటు మీద నుంచి లేవలేదని ఆగ్రహంతో యువతి ని కులం పేరుతో దూషించడం సరికాదన్నారు.
జరిగిన విషయం తన భర్త జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ కుమార్ ఫోన్ చేసి తెలిపిందన్నారు. దీంతో బస్సు జగిత్యాల చేరుకోగానే బస్ డిపో సమీపంలో ఫర్హా ప్రయాణిస్తున్న బస్సులో ఎక్కి ఆమెపై దాడి చేసి వీడియో రికార్డు చేస్తున్న ఆమె ఫోన్ లాక్కోవడం సరికాదన్నారు. అనంతరం ఎస్సై అనిల్ కుమార్ పై కేసు నమోదు చేసి విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని ఆర్డీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పలు ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.