అభివృద్ధి చేయడం లేదంటూ కార్పొరేటర్ల ఆందోళన..
రామగుండం కార్పొరేషన్ లో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదని, అవినీతి తప్ప అభివృద్ధి జరగటం లేదంటు కార్పొరేటర్ల కార్పొరేషన్ సమావేశాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు.
దిశ, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ లో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదని, అవినీతి తప్ప అభివృద్ధి జరగటం లేదంటు కార్పొరేటర్ల కార్పొరేషన్ సమావేశాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు. కార్పొరేషన్ కు వందల కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయని చెప్పుతున్నా రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు అల్లాడుతున్నారన్నారు. మేయర్ కు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని కార్పోరేటర్లు ఆరోపించారు.
కార్పొరేషన్ ను సుందరీకరణ చేస్తున్నామని గొప్పులు చెప్పుతున్నా ఎక్కడ అభివృద్ది జరుగుతుందో మేయర్ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న కార్పోరేటర్ల పై మేయర్ చిందులు వేశారు. మేము అమరవీరులకు నివాళ్ళర్పిస్తున్నాము మీరు పాల్గొనకుండా ధర్నాలు చేయటం సబబు కాదంటు రుసరుసలాడారు. పనులు చేసే వరకు ధర్నా విరమించేది లేదంటు కార్పోరేటర్లు భీష్మించుకొని కూర్చున్నారు. కమీషనర్ ఆందోళన విరమించాలని కోరిన వినలేదు.