హైదరాబాద్​కు రండి....మాట్లాడదాం

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించుకుందామని, ఈ మేరకు ఐదుగురు ప్రతినిధులు హైదరాబాద్​కు రావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Update: 2024-12-15 12:02 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించుకుందామని, ఈ మేరకు ఐదుగురు ప్రతినిధులు హైదరాబాద్​కు రావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్​ నుండి సిరిసిల్ల మీదుగా జిల్లాలోని బోయిన్ పల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనానికి వెళ్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని చూశారు.

    ఈ క్రమంలో టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ ద్వారా సమ్మె చేస్తున్న ఉద్యోగులతో ఫోనులో మాట్లాడారు. కుటుంబ సభ్యులతో దత్తాత్రేయ దర్శనానికి వెళుతున్న సందర్భంలో ఆగలేకపోయానని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. మళ్లీ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐదుగురు ప్రతినిధులు హైదరాబాద్​కు వస్తే సంబంధిత మంత్రితో మాట్లాడిస్తానన్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రితో కూడా మాట్లాడించి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం హామీ ఇవ్వడంతో సమగ్ర శిక్ష ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 


Similar News