BRS Leader: మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి
మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై బీఆర్ఎస్(BRS) నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి(Enugula Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)పై బీఆర్ఎస్(BRS) నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి(Enugula Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వేములవాడ రాజన్న(Vemulawada Rajanna Temple) కోడెల(Kodela)ను కబేళాకు తరలిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ అనుచరులే కబేళాకు తరలించారని అన్నారు. ఈ విషయం తన దృష్టికి వెళ్లినా కూడా మంత్రి కొండా సురేఖ ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. కోడెల ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అన్నారు. కాంగ్రెస్ సభ(Congress Sabha)కు రాజన్న నిధులు వాడారని ఆరోపించారు. దేవుడి సొమ్మును మంత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు.
Also Read..