KCR: అమెరికాకు కేసీఆర్! తొలిసారి అగ్రరాజ్యానికి ఎందుకంటే?
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అమెరికాకు వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అమెరికాకు వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటి వరకు అగ్రరాజ్యం (America) అమెరికాకు వెళ్లలేదు. తాను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా కేవలం రెండు విదేశీ పర్యటనలు మాత్రమే చేశారు. అందులో ఒకటి చైనా రెండోది సింగపూర్. దేశంలోనే అత్యంత తక్కువ విదేశీ పర్యటనలు చేసిన సీఎంగా కేసీఆర్ నిలిచారు. తాజాగా కేసీఆర్ అగ్రరాజ్యానికి పయనమవుతున్నారు. త్వరలోనే అమెరికాకు కేసీఆర్ వెళ్లనున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టూర్ షెడ్యూల్ మాత్రం ఖరారు కాలేదని, వెళ్లడం మాత్రం పక్కా అని పార్టీ నేతలు చెబుతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు అమెరికాలోనే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన మనవడు హిమాన్షు కోసం అగ్రరాజ్యం వెళ్లనున్నట్లు తెలిసింది. కొన్ని రోజులు పాలిటిక్స్‌కు రెస్ట్ ఇచ్చి మనవడు హిమాన్షుతో గడిపేందుకు.. ఫిబ్రవరిలోపు పర్యటన పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.