Sunday Effect: మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ
ములుగు (Mulugu) జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క (Sammakka), సారలమ్మ ( Saralamma) వన దేవతలను (Forest gods) దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు (devotees) భారీ ఎత్తున తరలివచ్చారు.
దిశ, వెబ్ డెస్క్: ములుగు (Mulugu) జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క (Sammakka), సారలమ్మ ( Saralamma) వన దేవతలను (Forest gods) దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు (devotees) భారీ ఎత్తున తరలివచ్చారు.సెలవు దినం కావడంతో పాటు మినీ మేడారం (Madaram) జాతర కూడా సమీపిస్తున్న సందర్భంగా భక్తులు ముందస్తూ గానే తమ మొక్కులు చెల్లించుకునేందుకు ఈరోజు మేడారం వచ్చారు. ఈ సందర్భంగా వన దేవతల గద్దెల ప్రాంగణంలో సమ్మక్క (Sammakka), సారలమ్మ (Sammakka), పగిడిద్దరాజు(Pagiddaraju), గోవిందరాజుల (Govindarajula) దేవతలకు పసుపు, కుంకుమ, బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతర వచ్చే ఏడాదిలో జరగనుంది.