Chamala: బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడుగా కాంగ్రెస్ ఎంపీ
బీబీనగర్ ఎయిమ్స్(Bibinagar Aims) పాలక మండలి(Governing Council) సభ్యుడుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) ఏకగ్రీవంగా(unanimously) ఎన్నికయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: బీబీనగర్ ఎయిమ్స్(Bibinagar Aims) పాలక మండలి(Governing Council) సభ్యుడుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) ఏకగ్రీవంగా(unanimously) ఎన్నికయ్యారు. తెలంగాణలోని బీబీనగర్ లో ఉన్న ఎయిమ్స్ వైద్యశాలకు నూతనంగా 24 మంది ఎంపీలు పాలక మండలి సభ్యులు నియామకం అయ్యారు. ఇందులో తెలంగాణ(Telangana) నుంచి కాంగ్రెస్ ఎంపీ(Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్(Mahabubnagar) బీజేపీ ఎంపీ డీకే అరుణ(BJP MP DK Aruna) ఎంపికయ్యారు. ఈ మేరకు లోక్ సభ కార్యాలయం(Lok Sabha office) ప్రకటన విడుదల చేసింది. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ చామల ట్విట్ చేశారు. ఈ సందర్భంగా.. భువనగిరి పార్లమెంట్(Bhuvanagiri Parliament constituency) పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్ పాలక మండలి సభ్యుడిగా తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.