Group-2 Exam: సెల్‌ఫోన్ తీసుకెళ్లి ఎగ్జామ్ రాసిన గ్రూపు-2 అభ్యర్థి
గ్రూపు-2 పరీక్ష(Group-2 Exam)ల వేళ తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: గ్రూపు-2 పరీక్ష(Group-2 Exam)ల వేళ తెలంగాణలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి ఎగ్జామ్ హాల్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లింది. వికారాబాద్(Vikarabad) జిల్లా కేంద్రంలోని శ్రీసాయి డెంటల్ కళాశాల(Srisai Dental College)లో ఈ ఘటన చోటుచేసుకుంది. లోదుస్తుల్లో సెల్‌ఫోన్ దాచి ఎగ్జామ్ హాల్‌లోకి ప్రవేశించిందని అధికారులు గుర్తించారు. అనంతరం సదరు విద్యార్థిని అదుపులోకి తీసుకొని డెంటల్ కాలేజీ(Dental College)లోనే విచారించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తంగా గ్రూప-2 పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి.
మొత్తం 33 జిల్లాల్లో 1,368 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. టీజీపీఎస్సీ(TGPSC) ఆదేశాల మేరకు అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను మూసేశారు. మొదటిరోజు పరీక్ష ఆదివారం డిసెంబర్ 15 పేపర్ -1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. పేపర్ -2 మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. ఇక రెండో రోజు పరీక్ష డిసెంబర్ 16 సోమవారంపేపర్ 3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 4 మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది.