RRR: దక్షిణ భాగం రీజినల్ రింగ్‌రోడ్డు టెండర్ల కు నేడు తుది గడువు
రాష్ట్రంలోని దక్షిణ భాగం ట్రిపుల్ఆర్ రోడ్డు టెండర్ల ప్రక్రియ పనులకు ప్రభుత్వం నేడు సోమవారం తుది గడువు విధించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని దక్షిణ భాగం ట్రిపుల్ఆర్ రోడ్డు టెండర్ల ప్రక్రియ పనులకు ప్రభుత్వం నేడు సోమవారం తుది గడువు విధించింది. గత నెల 26 న ఇందుకోసం రోడ్లు భవనాల శాఖ ద్వారా టెండర్లను పలిచిన విషయం తెలిసిందే. ఈ టెండర్ల ప్రక్రియ గనుక సజావుగా సాగితే ట్రిపుల్ఆర్ రోడ్డు పనులు ఇక వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉత్తర భాగం విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళుతున్న క్రమంలో దక్షిణ భాగం టెండర్లకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. ఇందుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో గత నెల లోనే టెండర్ల ప్రక్రియను ఆర్ అండ్ బి శాఖ ముందుకు తీసుకువచ్చింది. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటానికి రీజినల్ రింగు రోడ్డు (RRR) ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు 40. కి.మీ దూరం నుంచి ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఇటీవలే ఆమోదం తెలిపింది. దీంతో రాజధాని హైదరాబాద్ కు 340 కిలో మీటర్ల చుట్టు ఈ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నారు. ఉత్తర భాగం ఆర్ఆర్ ఆర్కు సుమారు రూ. 9 వేల 500 కోట్లు ఖర్చు కానుండగా, దక్షిణ భాగం రీజిరల్రింగ్రోడ్డుకు గాను రూ. 6480 కోట్ల వరకు ఖర్చు కానుందని అంచనా. అయితే ఉత్తర భాగానికి 164 కిలో మీటర్ల వరకు వ్యాపించి ఉండగా, అదే దక్షిణ భాగం 182 కిలో మీటర్లు వ్యాపించి ఉంది. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి సూపర్ గేమ్ ఛేంజర్ అని.. రింగు రోడ్డు అందుబాటులోకి వస్తే సగం తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. దక్షిణ, ఉత్తర రెండు భాగాలుగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న క్రమంలో ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం నుంచి నేషనల్ హైవే హోదా లభించింది. ఈ క్రమంలో దక్షిణ భాగం అలైన్‌మెంట్ విషయంలో ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. దక్షిణ తెలంగాణ రహదారి నిర్మాణానికి ఇప్పటిదాకా పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (PPP), హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM), బిల్డ్-ఆపరేట్-టోల్ (BOT) పద్ధతులను పరిశీలించిన రేవంత్ ప్రభుత్వం తాజాగా ‘ఇన్‌విట్’ విధానంపై దృష్టి సారిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణభాగం నిర్మాణం విషయంలో ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇన్‌విట్ విధానం అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వె్‌స్టమెంట్ ట్రస్ట్ అని అర్థం. రహదారి నిర్మాణానికి అవసరమైన మౌళిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను బాండ్ల రూపంలో సేకరించే విధానమే ఇన్‌విట్ విధానం అని ఆర్ అండ్ బి అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏ ప్రాజెక్టు కోసం ఈ నిధులను సేకరిస్తున్నారో అదే ప్రాజెక్టుకు ఈ నిధులను పూర్తిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా ఖర్చు చేస్తే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కూడా వర్తించదని అధికారులు చెబుతున్నారు. సర్కార్ చేపట్టే ప్రాజెక్టు నుంచి వచ్చే ఆదాయంతో ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసిన రుణాన్ని తీర్చాల్సి ఉంటుంది. ఇందుకు ఆర్ అండ్ బి శాఖ కూడా అంగీకారం తెలియజేసింది.
టెండర్లు ముగిశాక పనులు వేగవంతం.. ఈఎన్సి పి. మధుసూధన్‌రెడ్డి
రీజినల్‌రింగ్ రోడ్డు టెండర్ల ప్రక్రియ నేడు 16న ముగియనుందని, దీంతో ఇక పనులు వేగంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందని రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ఇన్ చీఫ్పి. మధుసూధన్‌రెడ్డి “దిశ ” మీడియాకు తెలిపారు. ఈ టెండర్లలో కన్సల్టెంట్ల కోసం ఇప్పటి వరకు ఎంత మంది పాల్గొన్నారు ? ఏఏ సంస్థలు ముందుకు వచ్చాయి? వాటికి రోడ్ల నిర్మాణంలో ఉన్న అనుభవం ఏమిటి? తదితర అంశాలను పరిశీలించాకే ఈ విషయంలో ముందుకు వెళ్తామని ఈఎన్సీ వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ భాగం రీజినల్రింగ్రోడ్డు నిర్మాణానికి గాను భూసేకరణ అలైన్మెంట్ఎంత అవసరం కానుంది? ఈ రోడ్డు నిర్మణానికి గాను నిధుల ఖర్చు ఎంత కావచ్చు? ఇందులో నిధులు ఎక్కడి నుండి సేకరించాలి ? రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంత ? కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత ? లేదా విదేశీ పెట్టుబడి దారులను కలుపుకుంటే వారి నుండి లభించే నిధుల శాతం ఎంత? ఈ నిధులలోంచి భూసేకరణకు ఎంత కేటాయించాలి? కన్సల్టెషన్లకు ఎంత ఇవ్వాలి? ఆర్‌ఆర్‌ఆర్ రోడ్ల డిజైన్ కు ఎంత కావచ్చు? కన్స్ట్రక్షన్కు ఎంత అవుతుంది? అన్నింటికీ మించి రోడ్డు నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్, ఇసుక, కంకర, అవసరమైన చోట్ల డాంబర్ (తారు ) తదితర అవసరాలు ఎంత అవుతాయి? వంటి విషయాలు కూడా టెండర్లు ముగిశాకే తేలే అవకాశం ఉంటుందని ఇంజనీర్ఇన్ చీఫ్పి. మధుసూధన్‌రెడ్డి తెలిపారు. కాగా రోడ్లు భవనాల శాఖ అధికారుల వర్సెన్ ఇలా ఉంటే... టెండర్లలో పాల్గొనే వారి వర్షన్ మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ భాగం, ఉత్తర భాగం రీజినల్రింగ్రోడ్డుకు అయ్యే ఖర్చుల విషయంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంచనాకు వచ్చి ఉంటాయని, వారి సూచించిన ప్రకారంగానే రీజినల్ రింగ్‌రోడ్డును నిర్మించాల్సి ఉంటుందని చెబుతున్నట్లు సమాచారం.
ఉదా .. దక్షిణ భాగం రీజినల్‌రింగ్ రోడ్డు చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డిల మీదుగాను, అలాగే ఉత్తర భాగం రీజినల్‌రింగ్ రోడ్డను సంగారెడ్డి నుండి మొదలు కొని నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి భువనగిరి, ప్రజ్నాపూర్, భువనగిరి, చౌటుప్పల్ మీదుగా వెళ్లనుందని కాంట్రాక్టర్లకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ రీజినల్రింగ్రోడ్డు నిధుల కేటాయింపుల విషయానికి వస్తే గత తెలంగాణ ప్రభుత్వం 2021–22లో రూ. 750 కోట్ల నిధులను కేటాయించి 50 శాతం వరకు భూసేకరణకు వ్యయం చేసింది. ప్రస్తుతం సిఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రీజినల్ రింగ్‌రోడ్డుకు ఎంత ఖర్చు చేస్తుంది? ఎలా ముందుకు వెళుతోందన్న దానిపైనే ప్రస్తుతం ఇటు ప్రజలు, అటు రోడ్డుభవనాల శాఖ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి.