Lok Adalat: జాతీయ లోక్అదాలత్ లో భారిగా కేసుల పరిష్కారం
సుప్రీంకోర్టు జాతీయ లోక్ అదాలత్ ప్రక్రియలో మొత్తం 1,57,088 కేసులు విజయవంతంగా లిక్విడేట్ చేయబడ్డాయని తెలంగాణ డీజీపీ కార్యాలయం తెలిపింది.
దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టు జాతీయ లోక్ అదాలత్ ప్రక్రియలో మొత్తం 1,57,088 కేసులు విజయవంతంగా లిక్విడేట్ చేయబడ్డాయని తెలంగాణ డీజీపీ కార్యాలయం తెలిపింది. జాతీయ లోక్ అదాలాత్ లో పరిష్కరించబడిన కేసుల వివరాలను ఆదివారం పత్రిక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో , పోలీస్ డిపార్ట్‌మెంట్ సెటిల్‌మెంట్ కోసం అర్హత ఉన్న కేసులను గుర్తించింది , రెండు పార్టీలకు నోటీసులు అందజేసి సెటిల్‌మెంట్ ప్రక్రియ చెపట్టినట్లు తెలిపింది. ఈ ప్రక్రీయ 28 నవంబర్ 2024న ప్రారంభమై 14 డిసెంబర్ 2024న ముగిసిందని పేర్కోంది. ఈ ప్రక్రియలో విజయవంతంగా లిక్విడేట్ చేయబడ్డ కేసుల వివరాలు .
- మొత్తం ఎఫ్ఐఆర్ కేసులు: 20,752
- డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు2,131
- ఈ-పిటీ కేసులు: 74,767
- మోటారు వాహన చట్టం కేసులు: 59,438
కేసుల పరిష్కారంలో అత్యుత్తమంగా కృషీ చేసిన మొదటి ఐదు యూనిట్లు
- హైదరాబాద్ 24,546 కేసులు
- సైబరాబాద్- 12,797 కేసులు
- రాచకొండ-11,083 కేసులు
- సూర్యపేట 10,951 కేసులు
- నిజామాబాద్-10,246 కేసులు
జాతీయ లోక్ అదాలత్‌లో ప్రీ-లోక్ అదాలత్-ప్రొసీడింగ్‌లతో 4,893 సైబర్ మోసాల కేసులు పరిష్కరించి బాధితులకు రూ.33.27 కోట్ల రీఫండ్ చేయడం జరిగిందని డీజీపీ కార్యాయల వర్గాలు తెలిపాయి. రీఫండ్ గణాంకాలు మునుపటి లోక్ అదాలత్ గణాంకాలు రూ.27.2 కోట్లను అధిగమించాయని తెలిపారు. 2024 సంవత్సరం టీజీసీఎస్బీ అద్భుతమైన పురోగతిని సాధించిందని తెలిపారు. ఇప్పటి వరకు 17,210 మంది బాధితులకు రూ.155.22 కోట్లు రీఫండ్ చేయబడిందని పేర్కోన్నారు.
లోక్ అదాలత్‌లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అత్యుత్తమ పనితీరు కనబరిచిన యూనిట్లు
యూనిట్ కేసుల సంఖ్య రీఫండ్ చేయబడిన మొత్తం
1. సైబరాబాద్ 2,136 . రూ.12,77,49,117 /-
2. హైదరాబాద్ 268 రూ. 8,84,17,621/-
3. రాచకొండ 592 రూ. 4,53,06,114/-
4. టీజీసీఎస్బీ 60 రూ.1,06,49,044/- .
5. సంగారెడ్డి 188 రూ.98,63,438/-