HYD: తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడికి ప్రముఖుల పరామర్శ

పుష్ప-2(Pushpa-2 Movie) ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడిని ఎమ్మార్పీఎస్(MRPS) జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) పరామర్శించారు.

Update: 2024-12-15 11:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2(Pushpa-2 Movie) ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడిని ఎమ్మార్పీఎస్(MRPS) జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda Krishna Madiga) పరామర్శించారు. ఆదివారం ఆసుపత్రికి వెళ్లి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద(Nerella Sharada) ఆసుపత్రికి వచ్చారు. బాలుడ్ని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

వివరాల్లోకి వెళితే.. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా చూసేందుకు అల్లు అర్జున్(Allu Arjun) థియేటర్‌కు రాగా.. అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇదే థియేటర్‌కు సినిమా చూసేందుకు దిల్‌సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన భాస్కర్, అతడి భార్య రేవతి, కుమారుడు శ్రీతేజ్, కూతురు వెళ్లారు. అయితే అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రస్తుతం శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tags:    

Similar News