స్కూల్ వ్యాన్ దగ్ధం

హుజూరాబాద్ పట్టణంలోని మాంటెసోరీ హైస్కూల్ ఆవరణలో పార్కు చేసి ఉన్న ఓ వ్యాన్ మంటలంటుకొని దగ్ధమైంది.

Update: 2024-12-15 11:20 GMT

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణంలోని మాంటెసోరీ హైస్కూల్ ఆవరణలో పార్కు చేసి ఉన్న ఓ వ్యాన్ మంటలంటుకొని దగ్ధమైంది. ఈ సంఘటనా స్థలానికి పక్కనే ఉన్న సుధాకర్ పెట్రోల్ బంక్ నుండి హుటాహుటిన ఫైర్ ఎస్టింగిషర్స్ తో మంటలార్పడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది ప్రయత్నం చేశారు. ఇంతలోనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తిగా మంటలు ఆర్పారు. స్కూల్ ఆవరణలో నాలుగు స్కూలు వాన్ లు పార్కింగ్ చేసి ఉన్నాయి. మంటలను గమనించకపోతే పక్కనున్న మరో నాలుగు స్కూలు వ్యాన్ లకు మంటలు అంటుకునే ప్రమాదం ఉండేది.

    ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ గీతా షాజును వివరణ కోరగా గత మూడు నెలలుగా స్కూల్ వ్యాన్ రిపేర్ లో ఉండడంతో పక్కన పెట్టినట్టు తెలిపారు. ఆదివారం కావడంతో ఆ పరిసరాల్లో ఎవరూ లేరన్నారు. స్కూల్ వ్యాన్ లో ఆకతాయిలు మద్యం తాగిన ఆనవాళ్లు ఉన్నాయని, అగ్గిపెట్టె తో సిగరెట్లు తాగి వ్యాన్ లో వేయడం వల్ల వ్యాన్ కు మంటలు అంటుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించి ఆకతాయిలను గుర్తిస్తామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పక్కనే నివాస గృహాలు ఉండటం, వాటికి మంటలు అంటుకోకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.  


Similar News