Collector Koya Shree Harsha : భూసేకరణ అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలి

భూ సేకరణ పై వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని

Update: 2024-09-10 10:38 GMT

దిశ, పెద్దపల్లి : భూ సేకరణ పై వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సింగరేణి, ఎన్టిపిసి భూ సేకరణ అంశంలో ఉన్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతర్గాం మండలం మొగల్ పహాడ్ గ్రామంలో ఎన్టిపిసి సంస్థ యాష్ పౌండ్ నిర్మాణానికి అవసరమైన 606 ఎకరాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సేకరణ పై రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని, అభ్యంతరాల పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

అనంతరం రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలో సింగరేణి భూసేకరణ సంస్థ సంబంధించి పెండింగ్ ఉన్న ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పరిశీలించారు. సింగరేణి కోసం ఆర్ జి 1 లో 49 ఎకరాల పట్టా భూమి సేకరించాల్సి ఉందని, ఇదే గ్రామంలో ఉన్న 269 ఎకరాల ప్రభుత్వ సింగరేణికు లిజ్ ఇచ్చామని తెలిపారు. ఈ భూముల్లో పొజిషన్ లో ఉంటూ సాగు చేసుకుంటున్నట్లు కొందరు రైతులు అందించిన దరఖాస్తుల మేరకు ఎంజాయ్మెంట్ సర్వేను కలెక్టర్ ఆదేశించారు. ఈ ఎంజాయ్మెంట్ సర్వే క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా నిర్వహించి వాటి ఫలితాలు నోటీసు బోర్డుపై అతికించాలని, దానిపై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, మందని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమ నాయక్, అంతర్గం తహసీల్దార్ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News