బాలింత కడుపులో గుడ్డ.. విచారణకు ఆదేశించిన కలెక్టర్

జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులో గుడ్డ మరిచిపోయి కుట్లు వేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా స్పందించారు.

Update: 2023-04-18 16:23 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులో గుడ్డ మరిచిపోయి కుట్లు వేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా స్పందించారు. ఆస్పత్రి సూపరిండెంట్ రాములును ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు ఆయన తెలిపారు. 16 నెలల క్రితం జరిగిన ఘటన కాబట్టి అప్పుడు విధులు నిర్వర్తించిన సిబ్బంది పూర్తి వివరాలను సేకరించి విచారణ జరిపిన రిపోర్టు వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు.

Tags:    

Similar News