బీఆర్ఎస్ , కాంగ్రెస్‌లకు డిపాజిట్లు రావు : ఈటల

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గోపాలపురం బత్తివానిపల్లి గ్రామంలో

Update: 2023-10-30 13:41 GMT

దిశ,కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గోపాలపురం బత్తివానిపల్లి గ్రామంలో సోమవారం ఈటల రాజేందర్- జమున దంపతులు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రావని అధికార పార్టీ చేపట్టిన వైఫల్యాలే బీజేపీ పార్టీ గెలుపుకు పునాదులు వేస్తాయని అన్నారు.కేసీఆర్ ఇచ్చిన హామీలు ప్రజలు విశ్వసించే కాలం పోయిందని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బిజెపి పార్టీ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News