గోదావరిలో పడి బాలుడి మృతి

ప్రమాదవశాత్తు గోదావరి పడి బాలుడు మృతి చెందిన ఘటన ధర్మపురి వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

Update: 2023-04-16 09:05 GMT

దిశ, వెల్గటూర్: ప్రమాదవశాత్తు గోదావరి పడి బాలుడు మృతిచెందిన ఘటన ధర్మపురి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అందాపూర్ గ్రామానికి చెందిన కార్తిక్ (13) స్థానికంగా ఏడో తరగతి చదువున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో బంధువులతో కలిసి గోదావరి పుణ్య స్థానాల కోసం ధర్మపురికి వచ్చారు.

గోదావరిలో స్నానం చేసి బంధువుల తో కలిసి ఇంటికి తిరిగి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారి కార్తిక్ గోదావరిలోని సత్యవతి గుండంలో పడి మృతి చెందాడు. గుండం లోతు ఎక్కువగా ఉండడంతో ఈత రాక బాలుడు నీట మునిగి చనిపోయాడు. తల్లిదండ్రుల కళ్లెదుటే కొడుకు మృతి చెందడం వారిని తీవ్రంగా కలిచి వేసింది. విషయం తెలుసుకున్న ధర్మపురి ఎస్సై కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో బాలుడి మృతదేహాన్ని గుండం నుంచి బయటకు తీయించారు.

అప్పటి దాకా ఆడుతూ పాడుతూ తమ కళ్ల ముందే తిరిగిన బాలుడు చలనం లేకుండా మృతదేహంగా తిరిగి రావడం చూసి బంధువుల రోదనలు మిన్నంటాయి. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వాసుప్రతికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. 

Tags:    

Similar News