Bhatti Vikramarka coming : ఈనెల 31 రామగుండానికి భట్టి విక్రమార్క రాక...

సింగరేణి కంపెనీ, రామగుండం కార్పొరేషన్ లో మౌలిక వసతుల కోసం అభివృద్ధి పనులు చేపట్టేందుకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2024-08-29 12:54 GMT

 దిశ, గోదావరిఖని టౌన్: సింగరేణి కంపెనీ, రామగుండం కార్పొరేషన్ లో మౌలిక వసతుల కోసం అభివృద్ధి పనులు చేపట్టేందుకు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31 శనివారం రోజున రామగుండం నియోజకవర్గంలోని సింగరేణి కంపెనీలో బొగ్గును మరింత ఉత్పత్తి చేసేందుకు కంపెనీకి సంబంధించిన అభివృద్ధి పనులు, రామగుండం కార్పొరేషన్ లోని ప్రజల మౌలిక వసతుల కోసం చేపడుతున్న అభివృద్ధి పనుల శిలాఫలకాలను ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రామగుండం శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, సింగరేణి అధికారులు పాల్గొంటారని తెలిపారు.


Similar News