పంట నష్టాన్ని పరిశీలించిన జడ్పీ చైర్ పర్సన్..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోనరావుపేట మండలంలోని గోవిందరావుపేట గ్రామంలో శనివారం ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి.
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోనరావుపేట మండలంలోని గోవిందరావుపేట గ్రామంలో శనివారం ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. గోవిందరావుపేట తండాలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు విరిగిపడ్డాయి, వరి పంట పొలాలు, ఇండ్ల గోడలు పూర్తిగా ద్వంసమయ్యాయి. దీంతో న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంట నష్టపోయిన బాధిత రైతులు కంటతడి పెట్టగా వారిని ఓదార్చారు.
జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చూస్తామని భరోసా కల్పించారు. అంతేకాకుండా నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ ఖీమ్య నాయక్ తో ఫోన్ లో మాట్లాడి రైతులకు జరిగిన నష్టాన్ని గూర్చి వివరించారు. వీరి వెంట సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ లు గంగాధర్, రజిత జగన్ నాయక్, పాక్స్ చైర్మన్లు బండ నర్సయ్య, సంకినేని రాంమోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు మల్యాల దేవయ్య, అధికారులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.