నిరుద్యోగి ఆత్మహత్య విషయంలో ప్రభుత్వంపై కేసు పెట్టాలి: ఆది శ్రీనివాస్
నిరుద్యోగి నవీన్ ఆత్మహత్య మంత్రి కేటీఆర్ చేసిన హత్యని ప్రభుత్వంపై... Adhi Srinivas serious on KCR
దిశ, సిరిసిల్ల: నిరుద్యోగి నవీన్ ఆత్మహత్య మంత్రి కేటీఆర్ చేసిన హత్యని ప్రభుత్వంపై పోలీసులు కేసు నమోదు చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నవీన్ ఆత్మహత్య మనసును కాల్చివేసిందని, నవీన్ ఆత్మహత్యపై రేవంత్ రెడ్డి స్పందించారని, నవీన్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఆయన కుటుంబానికి ఎక్స్ గ్రేషియా కోటి రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాగానే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అందిస్తామని, కేసీఆర్ ఇచ్చిన హామీ మర్చిపోయాడని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ నుంచే ప్రశ్నాపత్రాలు లీకేజీ అయ్యాయని తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు ఇవ్వలేకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కేవలం నాలుగు ఉద్యోగాలు మాత్రం కేసీఆర్ కుటుంబానికి వచ్చాయని విమర్శించారు. కేవలం ప్రభుత్వ విధానాల వల్లనే నిరుద్యోగులు చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.