ప్రజావాణిలో 6వ తరగతి విద్యార్థి ఫిర్యాదు

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతివారం నిర్వహించే ప్రజావాణిలో వినతులు ఇవ్వడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

Update: 2023-04-03 16:45 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతివారం నిర్వహించే ప్రజావాణిలో వినతులు ఇవ్వడం సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ క్రమంలో సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి రావడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆ తర్వాత బాలుడు ఇచ్చిన వినతిపత్రం స్వీకరించారు.

పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తాను 6వ తరగతి చదువుకుంటున్నానని పాఠశాలలో సరైన మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదురుకుంటున్నామని ఫిర్యాదులో విన్నవించాడు. స్పందించిన అధికారులు సదరు పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అయితే విద్యార్థుల సమస్యలు పరిష్కారం కొరకు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు ఫిర్యాదు చేయడం చూస్తుంటాం కానీ పాఠశాల విద్యార్థి నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News