KTR : సీఎంగా రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడం తెలంగాణ ప్రజల అదృష్టం..!? : కేటీఆర్

రేవంత్ రెడ్డిని సీఎంగా ఎన్నుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని..ఒక్క సీఎంను ఎన్నుకుంటే ఇంకో అర డజన్ మంది ఫ్రీ గా వచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ఎక్స్ వేదికగా సెటైరికల్ విమర్శలు చేశారు.

Update: 2025-01-10 06:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : రేవంత్ రెడ్డిని సీఎంగా ఎన్నుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని..ఒక్క సీఎంను ఎన్నుకుంటే ఇంకో అర డజన్ మంది ఫ్రీ గా వచ్చారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)ఎక్స్ వేదికగా సెటైరికల్ విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుటుంబ పాలనను తప్పుబడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు రాష్ట్రంలో 1 + 6 ఆఫర్ సీఎం వ్యవస్థ సాగుతోందని.. స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పడు చూడలేదెమోనన్నారు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డికి ఇవే నా హృదయపూర్వక శుభాకాంక్షలని ట్వీట్ లో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నాది ఒక చిన్న విన్నపమని..మీది ప్రజా పాలన కాబట్టి ప్రజలకి మీ అనుముల సీఎంలలో ఎవరు కావాలో ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని..ఐవీఆర్ఎస్(IVRS)పద్ధతి పెడితే బాగుంటుందేమో చూడండని వంగ్యంగా అభ్యర్థించారు.

కేటీఆర్ తన ట్వీట్ లో రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన..అనుముల రాజ్యాంగం నడుస్తోందంటూ తిరుపతిరెడ్డికి వికారాబాద్ లో లభించిన స్వాగత వీడియోను పోస్టు చేశారు. కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డికి వికారాబాద్‌లో మంత్రులను మించిన పోలీసు బందోబస్తు, కాన్వాయ్ అని..బూట్లు తీయించి, స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రికి చేసినట్టు పరేడ్ చేయించారని..ఎవని పాలయ్యిందిరో తెలంగాణ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

కాగా సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ పాలనపై కేటీఆర్ చేసిన విమర్శల పట్ల నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సీఎం కేసీఆర్ పాలనలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ కుమార్, హిమాన్షులు సాగించిన అధికార దర్పం మాటేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. నాటి సంగతులు విస్మరించి నేడు ఈ నీతి ప్రవచనాలు ఏమిటంటూ కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News