తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఇబ్రాం శేఖ‌ర్

తెలంగాణ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ స్టేట్ కోర్డినేట‌ర్ గా ఇబ్రాం శేఖ‌ర్ నియమితులయ్యారు.

Update: 2024-10-15 16:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ స్టేట్ కోర్డినేట‌ర్ గా ఇబ్రాం శేఖ‌ర్ నియమితులయ్యారు. ఆయనతో పాటు ఈశ్వర్ ను సైతం తెలంగాణ బీఎస్పీ స్టేట్ కోఆర్డినేట‌ర్ గా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావ‌తి నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఇబ్రాం శేఖ‌ర్, ఈశ్వర్ బాధ్యతలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా అంతకు ముందు తెలంగాణ‌కు ఒక కోర్డినేట‌ర్ మాత్రమే ఉండేవారు. కానీ ఈసారి పార్టీ ఇద్దరిని నియమించడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ.. పార్టీ కల్పించిన ఈ అవ‌కాశాన్ని బ‌హుజ‌నుల ఐక్యతకు, బీఎస్పీ బ‌లోపేతానికి పూర్తి స్థాయిలో ఉప‌యోగిస్తానని చెప్పారు. బీఎస్పీలో ఈ అవ‌కాశం క‌ల్పించిన బ‌హుజ‌న సుప్రీమ్ మాయావ‌తికి ఇబ్రాం శేఖర్ ధన్యవాదాలు తెలిపారు.


Similar News