విల్లాల కూల్చివేతకు సిద్ధమైన హైడ్రా.. భారీగా మోహరించిన పోలీసులు

అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. భారీ వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన హైడ్రా.. సోమవారం తెల్లవారుజామునే రంగంలోకి దిగారు.

Update: 2024-09-08 02:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మళ్లీ దూకుడు పెంచారు. భారీ వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన హైడ్రా.. ఆదివారం తెల్లవారుజామునే రంగంలోకి దిగారు. హైదరాబాద్‌‌లోని బాచుపల్లి చెరువు, బరంపేట చెరువు, బోరబండ సున్నపు చెరువులో అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఉదయాన్నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల్‌లోని కత్వా చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన విల్లాలను కూల్చివేయడానికి అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ కూడా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు ఇప్పటికే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ జ‌య‌భేరి సంస్థ ముర‌ళీ మోహ‌న్‌కు చెందినది. హైడ్రా నోటీసుల‌పై జయభేరీ సంస్థ ఇంకా స్పందించలేదు.


Similar News