రూ.2 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని రూ. 2,075 కోట్లతో నిర్మించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

Update: 2024-09-16 17:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని రూ. 2,075 కోట్లతో నిర్మించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అత్యాధునిక సౌకర్యాలతో, ఆధునిక హంగులతో దీన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణలో ఏ ఆసుపత్రీ లేనివిధంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. రెండు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2026 నాటికి దీన్ని పూర్తి చేస్తారు. ప్రస్తుత పాత భవనం కూలిపోయే దశలో ఉండటంతో గోషామహల్‌లో 31.39 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 30.28 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీన్ని నిర్మిస్తారు. ప్రస్తుతం 21 వైద్య విభాగాలు ఉండగా, కొత్తగా మరో ఆరు సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను కొత్త భవనంలో ఏర్పాటు చేస్తారు. హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, పాలియేటివ్‌ హెల్త్, రుమటాలజీ, జీరియాట్రిక్‌ మెడిసిన్‌లను కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తారు. 2 వేలకుపైగా పడకలతో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతీ సూపర్‌ స్పెషాలిటీ విభాగానికి ఒక ఆపరేషన్‌ థియేటర్‌ను నెలకొల్పుతారు. ఇంజినీర్లు నాలుగు నమూనాలను ఇవ్వగా, వీటిలో ఒక దాన్ని ప్రభుత్వం ఎంపిక చేయనున్నది.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా....

ఉస్మానియా కొత్త దవాఖాన సెంటర్ ఆఫ్​ ఎక్స్ లెన్స్ గా ఉండే విధంగా నిర్మించనున్నారు. ఈ హాస్పిటల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వివిధ టీచింగ్ ఆసుపత్రులను సమన్వయం చేసేలా వ్యవస్థను తయారు చేయనున్నారు. పేషెంట్ ఏ జిల్లాలో ఉన్నా, ఇక్కడ ఉన్న హెచ్ వోడీలు, సీనియర్ ప్రోఫెసర్లు టెలీ, వీడియో కాన్సల్టెన్సీ ద్వారా వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నారు. పేషెంట్లకు అధునాతన వార్డులు, వాష్​రూమ్ లతో పాటు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్​కూ కార్యాలయాలు ఉండనున్నాయి. కార్పొరేట్ తరహాలో భారీ వెయిటింగ్ రూమ్స్ నూ నిర్మించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లను ఇక్కడ్నుంచే భాగస్వామ్యం అయ్యేలా వీడియో కాన్ఫరెన్స్ హాల్, సౌకర్యాలు కల్పించనున్నారు. అన్ని విభాగాలకు రీసెర్చ్ యూనిట్లను సిద్ధం చేయనున్నారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు ప్రత్యేకంగా హైఎండ్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఖాయమని రవీంద్ర నాయక్ చురకలంటించారు. ఖాళీ దిమాక్ సైతాన్ కా ఘర్ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇప్పుడు ఏమీ చేయలేడని, కానీ కోట్లాది లక్షల అవినీతి సొమ్ముతో ప్రజాపాలనకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారని, అందుకే ఆయనతో పాటు ఆయన అనుయూయుల అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆయనపై విమర్శలకే పరిమితమైందని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రవీంద్ర నాయక్ ఫైరయ్యారు. 


Similar News