Narender Reddy: నరేందర్ రెడ్డి పిటిషన్ పై ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) రెచ్చగొట్టడం వల్లే కలెక్టర్, ఇతర అధికారులపై ప్రజలు దాడికి పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర్ రావు(Nageshwar Rao) అన్నారు.

Update: 2024-11-23 19:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narender Reddy) రెచ్చగొట్టడం వల్లే కలెక్టర్, ఇతర అధికారులపై ప్రజలు దాడికి పాల్పడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర్ రావు(Nageshwar Rao) అన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్(Petition)పై హైకోర్టు(High Court)లో వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫార్మా విలేజీ కోసం ప్రభుత్వం చేపట్టాలనుకున్న భూ సేకరణకు వ్యతిరేకంగా, ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి మాట్లాడారని నాగేశ్వర్ రావు కోర్టు దృష్టికి తీసుకవెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, సీడీల రూపంలో కోర్టుకు అందచేశారు. నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ వద్ద అరెస్ట్ చేయలేదన్నారు. కేబీఆర్ పార్కుకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని నరేందర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ లోనే ఉందని పీపీ కోర్టుకు తెలిపారు. నరేందర్ రెడ్డి తరుఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు(Gandra Mohan Rao) వాదనలు వినిపించారు. అరెస్ట్ సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని వాదించారు.

Tags:    

Similar News