తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.

Update: 2024-09-16 17:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి జీవో జారీ చేసింది. అంతేకాదు.. గల్ఫ్‌ కార్మికుల వెల్ఫేర్‌ కోసం అడ్వైజరీ కమిటీ నియమించనుంది. ప్రవాసి ప్రజావాణి పేరుతో ఫిర్యాదులు స్వీకరించనున్నది. బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు.. వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యావకాశాలను కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకటించారు.


Similar News