సాయిబాబా మృతదేహానికి ఎన్ పి ఆర్ డి ప్రతినిధి బృందం నివాళి

డాక్టర్ జి.ఎన్.సాయిబాబా అకాల మరణం పట్ల దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

Update: 2024-10-14 12:51 GMT

దిశ, ముషీరాబాద్: డాక్టర్ జి.ఎన్.సాయిబాబా అకాల మరణం పట్ల దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సోమవారం ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి యం.అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్.వెంకటేష్ టి.ఎమ్.కె.ఎమ్.కె.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకాల నర్సింహా లతో కూడిన ప్రతినిధి బృందం సాయిబాబా మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించి విడుదలైన కొద్ది నెలలకే ఆయన అనారోగ్యంతో మరణించడం దురదృష్టకరమని అన్నారు. అరెస్ట్ అయినప్పటి నుండి న్యాయం కోసం నిరంతరం న్యాయ పోరాటం చేశారని గుర్తుచేశారు. చివరకు ముంబై హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసిందన్నారు.


Similar News