బుల్లితెర నటికి వేధింపులు…నిందితుడు అరెస్ట్

ప్రేమ, పెళ్లి పేరుతో టీవీ సీరియల్ నటిని వేధింపులకు గురిచేసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2025-01-02 14:29 GMT

దిశ, జూబ్లీహిల్స్: ప్రేమ, పెళ్లి పేరుతో టీవీ సీరియల్ నటిని వేధింపులకు గురిచేసిన యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ(29) యూసుఫ్ గూడ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. సెప్టెంబర్ నెలలో ఓ సీరియల్ లో చేస్తున్న సమయంలో బత్తుల ఫణి తేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో ఆమెను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు. దీంతో ఆ మహిళ తనకు పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలున్నారని తెలిపింది. భర్తకు దూరంగా పిల్లలతో కలిసి ఉంటున్న అని విషయం చెప్పింది.

దీంతో బత్తుల ఫణి తేజ తో పెళ్లికి నిరాకరించింది. అప్పటి నుంచి అతను అసభ్యకరమైన సందేశాలు, వీడియోలు ఆమె వాట్సాప్ కి పంపుతున్నాడు. ఆమె అత్త ఇంటి చిరునామా తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమె గురించి చెడుగా చెప్పాడు. దీంతో బాధిత మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిందితుడు కాళ్ల బేరానికి వచ్చాడు. తన ప్రవర్తన కారణంగానే ఇదంతా జరిగిందని ఆమెకు సెల్ఫీ వీడియో పంపించాడు. బాధితురాలి క్యారెక్టర్ నీ దిగజార్చే విధంగా దుష్ప్రచారం చేయడంతో ఫణి తేజను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.


Similar News