Telangana Cabinet: కీలక ప్రాజెక్టులకు ప్రముఖుల పేర్లు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2025-01-04 17:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై అధికారిక ప్రకటన చేశారు. భూమిలేని పేదలకు భృతి, సన్నబియ్యం పంపిణీకి కేబినెట్ ఆమోదించింది. టూరిజం పాలసీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆంక్షలు లేని రైతు భరోసాకు ఆమోదం తెలిపింది. సంక్రాంతి కానుకగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పంచాయతీరాజ్‌లో 508 కారుణ్య నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. కొత్త గ్రామ పంచాయతీలను కేబినెట్ ఆమోదించింది. ములుగు గ్రామపంచాయతీని ములుగు మున్సిపాలిటీగా మారుస్తూ కేబినెట్ ఆమోదించింది.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి(Jaipal Reddy) పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ(Raja Narasimha) పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. జూరాల నుంచి కృష్ణా జలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు టెక్నీకల్ ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News