దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి తెప్పించు.. బీజేపీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy)కి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Aadi Srinivas) కీలక సవాల్ చేశారు.

Update: 2025-01-02 15:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy)కి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Aadi Srinivas) కీలక సవాల్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నిత్యం వార్తల్లో ఉండాలని అర్థంపర్థం లేని ఆరోపణలు, ఆధారాలు లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమది ప్రజా ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వమని అన్నారు. ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు.. దమ్ముంటే కేంద్రంతో మాట్లాడి నిధులు తెప్పించాలని సవాల్ చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)లో కొన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని.. వాటిని త్వరలో బయట పెడతామని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో మంత్రులు ఎవరెవరు ఇన్వాల్ అయ్యారో ఆధారాలతో సహా చెబుతామని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని అన్నారు. తాజాగా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

Tags:    

Similar News