తెలంగాణలో ఉప ఎన్నికలపై కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ !

తెలంగాణ రాష్ట్రంలో ( Telangana ) ఉప ఎన్నికలు ( By elections) రావడం పై గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కా

Update: 2025-03-27 08:58 GMT
తెలంగాణలో ఉప ఎన్నికలపై కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ !
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ( Telangana ) ఉప ఎన్నికలు ( By elections) రావడం పై గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి అన్న కామెంట్స్ కు కౌంటర్ ఇస్తూ రెచ్చిపోయారు కౌశిక్ రెడ్డి ( Padi Kaushik Reddy). తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని... పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర... గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సీఎం రేవంత్ రెడ్డి జాగిరి కాదని... తెలంగాణలో ఎలాగైనా ఉప ఎన్నికలు వస్తాయని తేల్చి చెప్పారు. సుప్రీం కోర్టు ( Supreme court) మీద తమకు నమ్మకం ఉందని... వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు రావడం గ్యారంటీ అని స్పష్టం చేశారు పాడి కౌశిక్ రెడ్డి.

మంత్రి పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. కేసీఆర్ ( KCR ) మాత్రమే రైతుల సంక్షేమం కోసం పనిచేశారని వెల్లడించారు. కెసిఆర్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు చాలా చక్కగా ఉండేవన్నారు. కానీ రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతిభద్రలు పూర్తిగా క్షీణించాయని ఫైర్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు పరాభవం తప్పదని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద ఏడుపు ఇకనైనా బంద్ చెయి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. 

Tags:    

Similar News