Mallareddy: మాకు దిష్టి తగిలింది.. సభలో మల్లారెడ్డి వ్యాఖ్యలకు నవ్వులు
సభలో మల్లారెడ్డి వ్యాఖ్యలకు నవ్వులు

దిశ, డైనమిక్ బ్యూరో: తనదైన పంచ్ డైలాగులతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచే మాజీ మంత్రి, మేడ్చల్ (Medchal) ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) తాజాగా సభలో నవ్వులు పూయించారు. ఇవాళ శాసనసభలో మాట్లాడిన మల్లారెడ్డి ఈ రోజు నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి ప్రభుత్వానికి రూ. 11 వందల కోట్లు లాభం వచ్చే విషయం, రెండోదది మా మేడ్చల్ నియోజకవర్గంలో సర్పంచ్ లు, కౌన్సిర్ల బాధ చెప్తానన్నారు. దీంతోసభలోని సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. కలగజేసుకున్న స్పీకర్ రెండు వద్దు ఒకటే చెప్పాలని సూచించారు. దీంతో మాట్లాడటం మొదలు పెట్టిన మల్లారెడ్డి మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలిందని.. మా జిల్లాలో 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయ్యాయి. పదేళ్ల కోసం మా బీఆర్ఎస్ రిజర్వేషన్లు తెచ్చింది. కానీ ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తం చేశారు. దయచేసి అడుగుతున్నా సేమ్ రిజర్వేషన్లు ఉండాలి. మమ్మల్ని జీహెచ్ఎంసీలో కలపొద్దు అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తర్వాత ప్రభుత్వానికి లాభం చేకూరే విషయం చేప్తానని మాట్లాడే ప్రయత్నం చేసినా స్పీకర్ అనుమతి ఇవ్వలేదు.