డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించండి
డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నార్కోటి క్యూరో డీసీపీ సాయి చైతన్య అన్నారు.
దిశ, చార్మినార్ : డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నార్కోటి క్యూరో డీసీపీ సాయి చైతన్య అన్నారు. సోమవారం బార్కస్ లోని ఆల్ సాది ఫంక్షన్ హాల్ లో జరిగిన 'యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్'కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి చైతన్య మాట్లాడుతూ… డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. మీ పరిసరాల్లో ఎవరైనా మత్తుకు బానిస అయితే వారిని పునరావాసా కేంద్రాలకు పంపించాలని లేదా పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ఇప్పటికే మాదక ద్రవ్యాలకు అలవాటుపడినవారిని ఆ అలవాటు మానుకునేలా కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
మాదక ద్రవ్యాలు లేకుండా నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో మాదక ద్రవ్యాలను వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాలను వినియోగించే వారిని గుర్తించేందుకు దేశంలో ఎక్కడా లేని అధునాతన పరికరాలు మన రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయన్నారు. మత్తును సేవించినా లేదా క్రయవిక్రయాలు జరిపినా శిక్షలు తప్పవన్నారు. అలాంటి వారిపై నార్కోటిక్ బ్యూరో పటిష్టమైన నిఘా పెడుతుం దన్నారు. సమావేశంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ క్రాంతి లాల్ పాటిల్ సుభాష్, చాంద్రాయణగుట్ట ఏసీపీ కె. మనోజ్ కుమార్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.గురునాథ్, బండ్లగూడ ఇన్స్పెక్టర్ కె. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.