సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఓయూలో ఆందోళన..
అధికారులు జారీ చేసిన సర్క్యులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని

దిశ, సికింద్రాబాద్ : అధికారులు జారీ చేసిన సర్క్యులర్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఓయూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఓయూ పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. అప్రజాస్వామికంగా విడుదల చేసిన సర్క్యులర్ ను తక్షణమే వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మేధావులు ,ప్రజా సంఘాలు, ప్రతి పక్షాలు, రాజకీయ పార్టీల సర్క్యులర్ పై ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అరెస్టయిన వారిలో జార్జి రెడ్డి పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎన్.సుమంత్, డీబీఎస్ఏ జంగిలి దర్శన్, బీఆర్ఎస్వీ పెద్దమ్మ రమేష్, జంగయ్య, స్పోర్ట్స్ ఫెడరేషన్ శాగంటి రాజేష్, ఎస్.ఎస్.యూ మొగిలిపాక నవీన్, జేవీఎస్ చేరాల వంశీ, బీఆర్ఎస్.వి రాజేష్ నాయక్, మిథున్ ప్రసాద్, రామకృష్ణ, శివ, జార్జి రెడ్డి పీడీఎస్ యూ నేతలు ఎం.వెంకటేష్, ఎస్.అంజి తదితరులు ఉన్నారు.