విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

నీట్ పేపర్ ను లీక్ చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు.

Update: 2024-06-18 14:44 GMT

దిశ, హిమాయత్‌నగర్‌ : నీట్ పేపర్ ను లీక్ చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు నీట్ అవకతవకలకు నిరసనగా, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, విద్యార్థి, యువజన సంఘాలు 'స్టూడెంట్ మార్చ్'ను నిర్వహించాయి. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని నారాయణగూడ వైఎంసీఏ నుంచి హిమాయత్ నగర్ మీదుగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

    మాట్లాడుతూ ఎన్డీఏ నాయకులు నీట్ పేపర్ ను అమ్ముకుని విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ ను రద్దు చేసి మరలా పరీక్షను నిర్వహించాలని, నీట్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్ అవకతవకలపై విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News