బోనాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

బోనాల ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గాంధీ నగర్ ఏసీపీ మొగిలయ్య సూచించారు.

Update: 2024-06-26 16:16 GMT

దిశ, ముషీరాబాద్ : బోనాల ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గాంధీ నగర్ ఏసీపీ మొగిలయ్య సూచించారు. బుధవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బోనాల సందర్భంగా దేవాలయాలకు సంబంధించిన నిర్వాహకులు, కార్యకర్తలు, పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల సందర్భంగా ఏర్పాట్లు ఎలా చేసుకోవాలన్న

    అంశంపై చర్చించారు. ఎలాంటి గొడవలు కాకుండా శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇందుకోసమే కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దోమలగూడ ఇన్​స్పెక్టర్ దొంతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిక్కడపల్లి ఇన్​స్పెక్టర్ ఏరుకొండ సీతయ్య, ఎస్ఐలతో పాటు పలు దేవాలయాల నిర్వాహకులు పాల్గొన్నారు. 

Similar News