సారస్వత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారాలు

తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు 2024 సంవత్సరానికి గాను తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రకటించింది.

Update: 2024-06-26 11:42 GMT

దిశ , హైదరాబాద్ బ్యూరో : తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు 2024 సంవత్సరానికి గాను తెలంగాణ సారస్వత పరిషత్తు రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రకటించింది. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య బుధవారం వివరాలు వెల్లడించారు. పద్య, గేయ కవిత్వంలో రాచాలపల్లి బాబు దేవిదాస శర్మ

     రచించిన 'శ్రీరామాయణోపనిషత్తు', వచన కవితలో తోట నిర్మలా రాణి అద్దం నా చిరునామా కాదు బహుమతులను గెలుచుకున్నాయి. అలాగే నవలా ప్రక్రియలో డాక్టర్ వెన్నం ఉపేందర్ రచించిన 'మత్తడి దునికిన కోపుల నీళ్లు' గ్రంథం, సాహిత్య విమర్శలో బండారి రాజ్ కుమార్ రచించిన 'తెలంగాణ కవి ముద్ర' గ్రంథం , కథ ప్రక్రియ లో డాక్టర్ పసునూరి రవీందర్ రచించిన 'కండిషన్స్ అప్లై' గ్రంథం పురస్కారానికి ఎంపికయ్యాయని వివరించారు. రావుల పుల్లాచారి రచించిన 'రచ్చబండ' నాటికల సంపుటి పురస్కారానికి ఎంపికైందని, పోలీస్ భూమేష్ రచించిన 'స్వేచ్ఛకు సంకెళ్లు' కవితా సంపుటికి యువ పురస్కారం లభించిందని తెలిపారు

వరిష్ఠ పురస్కారాలు ...

పుస్తకాలతో నిమిత్తలేకుండా సాహిత్య రంగంలో సమగ్ర కృషిని గుర్తిస్తూ నలుగురు ప్రముఖులకు పరిషత్తు ఏటా వరిష్ట పురస్కారాలు అందజేస్తోంది. ఈసారి ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శ్రీరంగాచార్య, ప్రముఖ కవి, రచయిత జింబో (మంగారి రాజేందర్),

    ప్రముఖ ప్రజాకవి జయరాజు, ప్రముఖ కథ, నవలా రచయిత బోరి మురళీధర్ లకు 2024 సంవత్సరానికి వరిష్ట పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వారు తెలిపారు. త్వరలో సారస్వత పరిషత్ లో జరిగే కార్యక్రమంలో ఉత్తమ గ్రంథ రచనలు, వరిష్ట పురస్కారాల కింద రూ. 20 వేలు నగదు, యువ పురస్కారం కింద రూ.10 వేలు నగదు, జ్ఞాపిక, శాలువా తో సత్కరించడం జరుగుతుందని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి డాక్టర్ జె. చెన్నయ్య తెలిపారు. 

Similar News