HYD: మూసీ ప్రక్షాళన షురూ.. మలక్‌పేట్ శంకర్‌నగర్‌లో కూల్చివేతలు ప్రారంభం

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఫుల్ ఫోకస్ పెట్టింది.

Update: 2024-10-01 06:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఫుల్ ఫోకస్ పెట్టింది. మూసీ సుందరీకరణ (Mousse beautification), ప్రక్షాళన చేసేందుకు సర్కార్ మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ (Musi Riverfront Development Corporation) పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కి.మీ పరిధిలో మొత్తం 40 వేల ఆక్రమణలను గుర్తించిన అధికారులు వాటి కూల్చివేతలను మంగళవారం ప్రారంభించారు. ఇప్పటికే చాదర్‌ఘాట్‌ మూసీ పరివాహక ప్రాంతాల్లోని మూసానగర్‌, రసూల్‌పుర, వినాయక్‌నగర్‌ పరిసరాల్లో ఇళ్లకు రెవెన్యూ అధికారులు ఆర్బీ-ఎక్స్‌ మార్కింగ్‌ చేసి సీల్ వేశారు. అదేవిధంగా మలక్‌పేట్ (Malakpet) పరిధిలోని శంకర్‌నగర్ మూసీ రివర్ బెడ్‌లో ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు వెళ్లేందుకు అక్కడ సరైన దారి లేకపోవడంతో అధికారులు కూలీల సాయం తీసుకుని కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని నిర్వాసితులను అధికారులు ఇప్పటికే చెంచల్‌గూడ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయానికి తరలించారు. ఈ మేరకు ఖాళీ అయిన ఇళ్లను అధికారులు కూల్చివేయడం ప్రారంభించారు.   


Similar News