Donkey Palace: రాష్ట్రంలో రూ.100 కోట్ల మోసం.. సీఎం రేవంత్‌కు రైతుల రిక్వెస్ట్
హైదరాబాద్(Hyderabad) నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గాడిద పాల ఉత్పత్తి(Donkey milk production) పేరిట తమిళనాడులోని చెన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ సంస్థ(Donkey Palace Company) రూ.100 కోట్ల మోసానికి పాల్పడింది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) నగరంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గాడిద పాల ఉత్పత్తి(Donkey milk production) పేరిట తమిళనాడులోని చెన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ సంస్థ(Donkey Palace Company) రూ.100 కోట్ల మోసానికి పాల్పడింది. తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రైతులను మోసగించింది. తెలంగాణకు చెందిన బాధితులు శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తమ ఆవేదనను వెల్లగక్కారు. రైతులకు ఒక్కో గాడిదను రూ.లక్షన్నరకు డాంకీ ప్యాలెస్ సంస్థ అమ్మింది.
వాటి నుంచి వచ్చే పాలను లీటర్‌కు రూ.1600ల చొప్పున కొనుగోలు చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నది. దాదాపు మూడు నెలల పాటు రూ.1600లకు లీటర్ చొప్పున కొనుగోలు చేసి రైతుల్లో నమ్మకం కలిగించింది. తర్వాత 18 నెలల నుంచి కాలయాపన చేస్తూ వస్తోంది. దీంతో మోసపోయామని భావించిన రైతులు మీడియా ముందుకు వచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.