Hot News: గులాబీ పార్టీలో ‘ట్యాపింగ్’ టెన్షన్.. ఇప్పటికే ముగ్గురికి నోటీసులు
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలతో గులాబీ ఎమ్మెల్యేలకు నోటీసులు, మరోవైపు కొంతమంది నేరుగా పోలీసుకు ఫిర్యాదు చేస్తుండటంతో కేసులు నమోదు అవుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలతో గులాబీ ఎమ్మెల్యేలకు నోటీసులు, మరోవైపు కొంతమంది నేరుగా పోలీసుకు ఫిర్యాదు చేస్తుండటంతో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఎవరిపై ఎవరు ఫిర్యాదు చేస్తారో.. ఏ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అవుతుందో.. ఎవరిని ఎప్పుడు విచారణకు పిలుస్తారో అనే గుబులు నెలకొంది. ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. తాజాగా హరీష్ రావుపై సైతం ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావడంతో పార్టీలో విస్తృత చర్చజరుగుతుంది. ఇంకా ఉమ్మడి పది జిల్లాల్లో చాలా మంది నేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం జరుగుతుంది.
బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన..
ఫోన్ ట్యాపింగ్ లో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ లీడర్లలో ఆందోళన మొదలైంది. ఈ కేసులు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వారి ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు నిందితుడిగా ఉన్న పోలీసు మాజీ అధికారులు వాగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఎవరి ఫోన్ ను ట్యాప్ చేయాలనే విషయాన్ని వాట్సాప్ ద్వారా మెసేజ్ లు పెట్టేవారని, ఆ మెసేజ్ లను పోలీసులు సేకరించినట్లు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నేతలను అరెస్టు చేస్తారనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది.
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్ రావు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు పోన్ ట్యాపింగ్ ఆరోపణలతో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. మునుగోడు బైపోల్ సమయంలో ప్రస్తుత నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుల ఫోన్లను చిరుమర్తి లింగయ్య ట్యాప్ చేయించారనే ఆరోపణలతో విచారించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది గులాబీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.
హరీశ్‌రావుపై ట్యాపింగ్ కేసు
తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమం గా కేసులు పెట్టి వేధించారని సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పంజాగుట్ట పీఎ స్ లో ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రి హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. ఆయనతో పాటు ఇప్పటికే ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావుపైనా పంజాగుట్ట పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ఒక్కసారిగా గులా బీ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇంకా ఎవరికి నోటీసులు ఇస్తారనేది పార్టీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైఫల్యాలపై ఎండగడుతూ పార్టీని యాక్టీవ్ చేసే పనిలో గులాబీ అధిష్టానం నిమగ్నమైంది. ఈ త రుణంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కావ డంతో బీఆర్ఎస్ లో హాట్ టాఫిక్ గా మారింది.
మరోవైపు ఉమ్మడి జిల్లాల వారీగా ఇంకా కొంతమంది నేతలు అధికారంలో ఉన్న సమ యంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు సైతం వచ్చాయి. పదిమందికిపైగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు వ చ్చే అవకాశం ఉందని ప్రచారం జోరుగా సాగు తోంది. పార్టీకి చెందిన కొందరు సైతం యాక్టీవ్ గా పనిచేసే నేతలను డీమోరల్ చేసేందుకు కేసు లు పెట్టి వేధిస్తారని బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే గులాబీ నేతలు పైకి గాంభీర్యం ప్రకటిస్తున్నప్పటికీ లోపాల మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. వారు చేసే వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి పాలమూరు, వరంగల్, నల్లగొండ జిల్లాలకు చెందిన మరికొంత మందికి నోటీసులు ఇస్తారనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ కొంత స్తబ్దత ఏర్పడింది. తాజాగా హరీష్ రావుపై కేసు నమోదుతో మళ్లీ ట్యాపింగ్ కేసుపై విస్తృత చర్చ ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ జరుగుతుంది.