భారీ అగ్ని ప్రమాదం.. మంటలార్పుతుండగా ఫైర్ సిబ్బందికి గాయాలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్‌లో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బాలాజీ శానిటరీ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.

Update: 2023-12-23 05:09 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్‌లో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బాలాజీ శానిటరీ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో ఇది గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న ఫైర్ సిబ్బంది దాదాపు నాలుగు గంటల పాటు నిర్విరామంగా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు తీవ్రం కావడంతో ఏడు ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదం వల్ల దాదాపు రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా శానిటరీ దుకాణంలో ఉన్న స్పిరిట్, కలర్‌ల వల్ల మంటలను ఆర్పుతున్న క్రమంలో ఫైర్ సిబ్బంది నలుగురికి గాయాలైనట్లు అగ్నిమాపక నిరోధక అధికారులు తెలిపారు.


Similar News