KCR : సైలెన్స్‌కు బ్రేక్! ప్రజల్లోకి వెళ్లనున్న గులాబీ దళపతి?
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా యాక్టివ్‌గా లేక చాలా రోజులు అవుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యక్షంగా యాక్టివ్‌గా లేక చాలా రోజులు అవుతోంది. రైతు రుణమాఫీ విషయంలో గులాబీ దళపతి ప్రజల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. తాజాగా మరోసారి గ్రాండ్‌గా రీ-ఎంట్రీ ఇస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో ప్రజల్లోకి వస్తారని ప్రచారం సోషల్ మీడియాలో సైతం చర్చానీయాంశంగా మారింది.
డిసెంబర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో హామీలపై ప్రజల్లోకి వెళ్లే కేసీఆర్ యోచనలో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్‌లో తదుపరి కార్యచరణ ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రజల సమస్యలు, హామీలపై ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లి ప్రభుత్వంపై పోరాడాలనే యోచనలో ఉన్న బీఆర్ఎస్ అధినేత ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు ప్రత్యక్షంగా తెలంగాణ రాజకీయాలపై యాక్టివ్‌గా లేని కేసీఆర్ సైలెన్స్‌కు బ్రేక్ ఇచ్చి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ హామీలపై తమ వైఖరిని వెల్లడించనున్నారని సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. అదేవిధంగా ఇటీవల పలువురు కీలక నేతలు పార్టీ మారడంతో శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నారని, దీంతో వారిలో జోష్ నింపేందుకు గులాబీ బాస్ ఎంట్రీ తప్పకుండా ఇస్తారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది.