కొండగట్టు ఆలయంలో చోరీ

జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం సంచలనం సృష్టిస్తోంది.

Update: 2024-10-13 13:39 GMT

దిశ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో దొంగతనం సంచలనం సృష్టిస్తోంది. ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. అన్నదాన సత్రంలో ఈనెల 9న బియ్యం బస్తాలు, ఇతర సామగ్రి తీసుకు వెళ్ళడం ఆలయ అధికారులు సీసీటీవి ఫుటేజీ ద్వారా గమనించారు. ఆ వ్యక్తి అన్నదాన సత్రంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ రాములుగా గుర్తించారు. ఈ వ్యవహారంపై రాములుకు మెమో జారీ చేసి.. విచారణకు ఆదేశించారు. నివేదిక అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. 


Similar News