ఇడ్లీలో జెర్రి.. షాకైన కస్టమర్ ఏం చేశాడంటే..
హోటళ్లలో ఫుడ్ తింటున్నప్పుడు.. లేదా పార్సిల్ తెచ్చుకున్నప్పుడు ఆ ఫుడ్‌లో అప్పుడప్పుడు ఈగలు, బొద్దింకలు, బల్లులు ప్రత్యక్షమైన ఘటనల గురించి తరచూ వింటూనే ఉంటాం.
దిశ, వెబ్‌డెస్క్/జగిత్యాల టౌన్: హోటళ్లలో ఫుడ్ తింటున్నప్పుడు.. లేదా పార్సిల్ తెచ్చుకున్నప్పుడు ఆ ఫుడ్‌లో అప్పుడప్పుడు ఈగలు, బొద్దింకలు, బల్లులు ప్రత్యక్షమైన ఘటనల గురించి తరచూ వింటూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో వినియోగదారులు సదరు హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం, దాడులు చేయటం, కేసులు పెట్టటం జరుగుతూ ఉంటుంది. అయితే, తాజాగా జగిత్యాలలోని ఓ టిఫిన్ సెంటర్ నుంచి ఇడ్లీ పార్సిల్ తీసుకెళ్లిన ఓ మహిళ.. ఇంటికెళ్లి ప్యాకెట్ ఓపెన్ చేయగా..అందులో జెర్రి ప్రత్యక్షం కావడంతో షాక్ అయింది. వెంటనే ఆ ప్యాకెట్ తీసుకుని హోటల్‌కి తిరిగొచ్చి ఓనర్‌తో వాగ్వాదానికి దిగగా.. అది జెర్రి కాదంటూ హోటల్ యజమాని బుకాయించడానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు చెక్ చేసి అది జెర్రేనని తేల్చారు. దంతో సదరు యజమాని ఇడ్లీలను పడేసేందుకు యత్నించాడు. ఇడ్లీలను హోటల్ నిర్వాహకులు బల్దియా టాక్టర్‌లో తరలించే ప్రయత్నం చేయగా.. అతడిని అడ్డుకున్న కస్టమర్ హోటల్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకుని హోటల్‌ను మూసివేయించారు.