Trending: రాష్ట్రంలో మరో సంచలనం.. బాలికల వసతి గృహంలో నగ్న పూజలకు యత్నం

నగ్న పూజలు (Naked Worship) కలకలం రేపిన ఘటన పెద్దపల్లి జిల్లా (Peddapally District) మంథని పట్టణం (Manthani Town)లోని బాలికల వసతి గృహంలో సోమవారం చోటుచేసుకుంది.

Update: 2024-11-26 05:39 GMT
Trending: రాష్ట్రంలో మరో సంచలనం.. బాలికల వసతి గృహంలో నగ్న పూజలకు యత్నం
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్/మంథని: నగ్న పూజలు (Naked Worship) కలకలం రేపిన ఘటన పెద్దపల్లి జిల్లా (Peddapally District) మంథని పట్టణం (Manthani Town)లోని బాలికల వసతి గృహంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాలికల వసతి గృహంలో ఓ మహిళ వంట మనిషిగా విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో నగ్నంగా పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని వసతి గృహంలోని బాలికలకు ఆమె మాయమాటలు చెప్పింది. సరిగ్గా వారం రోజుల క్రితం ఆ వంట మనిషి తన పర్సనల్ రూంకు ఓ వ్యక్తిని తీసుకువచ్చి ఓ బాలికను పిలిపించి అతడి ముందు నగ్నంగా నిలబడితే పూజ చేస్తాడని చెప్పింది.

దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ విద్యార్థిని వసతి గృహం నుంచి పారిపోయి మంథని పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే గత నాలుగు రోజులుగా తలదాచుకుంటోంది. సదరు బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ వద్దకు వెళ్లి వంట మనిషిని నిలదీశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు, ఎస్సై రమేష్ తెలిపారు. కాగా, మంథని‌లో గత కొన్ని రోజులుగా అక్రమ దందాలు, వ్యభిచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిర్వాహకులు ప్రలోభ పెట్టిన మహిళలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఘటన మంథని సంచలనం సృష్టించింది. 

Tags:    

Similar News