ఈ కుక్క ఖరీదు కోట్లలో.. అయినా కొనుగోలు చేసిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?

సాధారణంగా కుక్క పిల్లలను ఇంట్లో పెంచుకుంటారనే విషయం తెలిసిందే.

Update: 2025-03-20 11:43 GMT
ఈ కుక్క ఖరీదు కోట్లలో.. అయినా కొనుగోలు చేసిన వ్యక్తి.. కారణం  తెలిస్తే షాకవ్వాల్సిందే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: సాధారణంగా కుక్క పిల్లలను ఇంట్లో పెంచుకుంటారనే విషయం తెలిసిందే. చాలా మంది క్యూట్‌గా ఉండే చిన్న డాగ్స్‌ని కొనుగొలు చేసి తమ ఇంట్లో ఒక మనిషి వలే చూసుకుంటారు. ఇక కుక్కను కొనుగోలు చేసే క్రమంలో ఎంత డబ్బు వెచ్చిస్తారని అడిగితే.. చాలా మంది వేలల్లో చెబుతుంటారు. ఇంకొంచెం ముందుకెళ్లి లక్షల్లో అని చెబుతారు. కానీ.. రీసెంట్‌గా ఓ వ్యక్తి కొనుగొలు చేసిన శునకం ఖరీదు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ కుక్క ఖరీదు అక్షరాలా రూ.50 కోట్లు. ఈ రేటు విన్న తర్వాత సామాన్య ప్రజలు ఆశ్చర్యంతో తేరుకోవడం కష్టమనే చెప్పాలి.

కానీ బెంగళూరు(Bengaluru)కు చెందిన ప్రముఖ డాగ్ బ్రీడర్ మాత్రం జస్ట్ రూ.50 కోట్లేనా!? అనుకున్నారు. ఏం ఆలోచించకుండా వెంటనే ఆ కుక్క(Dog)ను కొనుగోలు చేశారు. అతను కొనుగొలు చేసిన డాగ్ పేరు కాడాబాంబ్ ఒకామి(Cadabomb Okami). బెంగళూరుకు చెందిన సతీశ్ అనే వ్యక్తి ‘కాడాబాండ్ ఒకామి’ అనే అరుదైన ‘వోల్ఫ్‌డాగ్’ ను $5.7 మిలియన్ల(సుమారు రూ.50 కోట్ల)కు కొనుగోలు చేశారు. అయితే దీన్ని కొనుగోలు చేశాకా అతను ఏం చెప్పారంటే.. నాకు కుక్కలంటే చాలా ఇష్టం. అందుకే దీనిని కొనుగోలు చేసేందుకు అంత ఖర్చు చేశా. అరుదైన, ప్రత్యేకమైన కుక్కలను ఇండియాకు పరిచయం చేయడం నాకిష్టం అని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా, ప్రజలు వాటిని చూడటానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు.. కాబట్టి నాకు తగినంత డబ్బు వస్తుంది. ఈ డాగ్(Dog) అమెరికా(US)లో జన్మించింది. దాని వయసు 8 నెలలు కాగా రోజు 3 కేజీల పచ్చి మాంసం తింటుందని చెప్పుకొచ్చారు. అయితే అరుదైన కుక్కలను కొని వాటిని పలు షోలలో ప్రదర్శించడం ద్వారా సతీష్‌కు భారీ సంపాదన వస్తోంది. ఒక షోలో తన కుక్కను ప్రదర్శించడానికి ఆయన 2.5 లక్షలు చార్జ్ చేసినట్లు సమాచారం.

READ MORE ...

Ostriches eating stones: వామ్మో.. ఈ పక్షులు రాళ్లను సైతం ఆరగించేస్తాయి!

Full View

Tags:    

Similar News