రేపు ఎర్త్ అవర్... ఓ గంట లైట్లు ఆపేద్దాం
గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారినందున భూమిని కాపాడుకునేందుకు రేపు శనివారం రాత్రి ఎర్త్అవర్ను ప్రతి ఒక్కరం పాటిద్దామని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు , తెలంగాణ లైసెన్స్ ఇన్ బోర్డ్ మాజీ సభ్యుడు నక్క యాదగిరి ఒక ప్రకటనలో విజ్క్షప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్లోబల్ వార్మింగ్ కారణంగా జీవరాశి ఉనికి ప్రశ్నార్థకంగా మారినందున భూమిని కాపాడుకునేందుకు రేపు శనివారం రాత్రి ఎర్త్అవర్ను ప్రతి ఒక్కరం పాటిద్దామని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు , తెలంగాణ లైసెన్స్ ఇన్ బోర్డ్ మాజీ సభ్యుడు నక్క యాదగిరి ఒక ప్రకటనలో విజ్క్షప్తి చేశారు. ఎర్త్అవర్ అనేది ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే వాతావరణ దినోత్సవం అని, పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణ వేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. విద్యుత్తును ఆదా చేస్తే సమస్త జీవరాసులనీ కాపాడేందుకు, మన తరాన్నీ, భవిష్యత్తు తరాలను కాపాడేందుకు ఉపకరిస్తుంది అన్నారు. మన దేశంలో డిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం అన్నారు.
ఈ భూమి దినోత్సవాన శనివారం రాత్రి ఓ గంట పాటు విద్యుత్ వినియోగాన్ని ఆపేద్దామన్నారు. అనవసరమైన విద్యుత్ దీపాలను ఆపివేయడం టీవీలు ఇతరత్రా కరెంటుతో నడిచే ఉపకరణాలన్నింటినీ ఓ గంట పాటు స్విచ్ ఆఫ్ చేయాలని కోరారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించే అవకాశం ఉందని, ఇలా విద్యుత్ ను ఆదా చేస్తే ఆ మేరకు భూ వాతావరణాన్ని పరిరక్షించిన వారం అవుతామని నక్క యాదగిరి విజ్ఞప్తి చేశారు.