Harish Rao: ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-07 07:32 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: ప్రభుత్వం తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నందినగర్‌లోని కేటీఆర్ (KTR) నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు (Raithu Bandhu) విషయాన్ని డైవర్ట్ చేసేందుకే కేటీఆర్‌ (KTR)పై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపింనందుకు కక్ష గట్టారని ఫైర్ అయ్యారు. ఏడాది తరువాత ఆ అంశంలో కేసు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై న్యాయవాదుతో చర్చించామని అన్నారు. ప్రభుత్వం ఇలా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కొంటామని.. ప్రజల తరఫున పోరాటాలు ఆపబోమని స్పష్టం చేశారు.

Lఇలాంటి కేసులు రానున్న రోజుల్లో ఇంకా పెడతారనే విషయం తమకు తెలుసని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బ్లాక్‌మెయిల్ (Blackmail), అక్రమ కేసులతో మమ్మల్ని బలహీనపరచాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి కేసులకు తాము భయపడే వాళ్లం కాదనన్నారు. క్వాష్ పిటిషన్ (Quash Petition) తీర్పు విషయంలో విచారణ కొనసాగించవచ్చని మాత్రమే హైకోర్టు (High Court) చెప్పిందని.. తప్పు జరిగినట్లుగా ధర్మాసనం నిర్ధారించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు (Six Guarantees) అమలు చేసే వరకు ప్రభుత్వం వెంట పడుతూనే ఉంటామని అన్నారు. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని, చట్టాలను గౌరవిస్తామని తెలిపారు. ఈ నెల 9న కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్తారని అన్నారు. ఫార్ములా ఈ-రేసు కేసు విషయంలో తాము న్యాయపరంగా ముందుకు వెళ్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.        

Tags:    

Similar News