Mohan Babu : సంక్రాంతి వేడుకల్లో సందడి చేస్తున్న మోహన్ బాబు
కుటుంబ వివాదాలు..జర్నలిస్టుపై దాడి కేసులతో సతమతమవుతున్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu) సంక్రాంతి వేడుక(Sankranthi Celebrations)ల్లో కాస్తా సేద తీరుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : కుటుంబ వివాదాలు..జర్నలిస్టుపై దాడి కేసులతో సతమతమవుతున్న సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu) సంక్రాంతి వేడుక(Sankranthi Celebrations)ల్లో కాస్తా సేద తీరుతున్నారు. రంగంపేటలోని తన విద్యా సంస్థ విద్యానికేతన్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు సందడి చేశారు. ఓ జర్నలిస్టుపై దాడి కేసులో కొద్ది రోజులుగా బెయిల్ కోసం అజ్ఞాతంలో ఉన్న మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షమవ్వడం ఆసక్తి రేపింది. కుతూరు మంచు లక్ష్మి కూడా ఈ వేడుకల్లో తండ్రితో పాటు కనిపించారు.
సంక్రాంతి వేడుకల సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులో మాట్లాడుతూ రాయలసీమ రామన్న చౌదరిలో ఓ డైలాగ్ ను గుర్తు చేస్తూ దానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. గతం గతః అని..నిన్న జరిగింది మర్చిపోయి..ఈ రోజు ఏం చేయాలనుకోవాలి..రేపు చేయాల్సిన మంచి పనుల గురించి ఆలోచించాలని..అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.
జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు అందుకు నిరాకరించడంతో అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ బాబు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 78 ఏళ్ల వయస్సు, గుండె ఇతర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నానని..తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించి విచారించగా..సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబా తరపు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. దీంతో కోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.