తెలంగాణలోను ఆరోగ్యశ్రీ సేవలు బంద్??
ఆరోగ్య శ్రీ(Aarogyasri) సేవలు అందించిన ఆసుపత్రులకు ప్రభుత్వాలు పెండింగ్ బిల్లులు(Pending bills) చెల్లించకపోవడంతో ఆస్పత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్య శ్రీ(Aarogyasri) సేవలు అందించిన ఆసుపత్రులకు ప్రభుత్వాలు పెండింగ్ బిల్లులు(Pending bills) చెల్లించకపోవడంతో ఆస్పత్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో రెండు రోజుల క్రితం ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల(Arogyashri Services)ను నిలిపివేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ బిల్లులు పెరిగిపోవడంతో EHS, OP సేవలను మాత్రమే బంద్ చేస్తున్నట్లు ఏపీ నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్(AP Network Hospitals Association) అధ్యక్షుడు కె.విజయ్‌కుమార్ (K.Vijayakumar) ప్రకటించారు.
ఈ క్రమంలోనే తెలంగాణ(Telangana) ప్రైవేటు ఆస్పత్రులు(Private hospitals) కూడా రేవంత్ ప్రభుత్వాని(Revant Govt)కి.. అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తుంది. సంవత్సరం కాలంగా ఆరోగ్యశ్రీ బకాయిలు(Arogyashri dues) రూ. 1000 కోట్లకు పైగా పెండింగ్(Pending)లో ఉన్నాయని.. వాటిని వెంటనే విడుదల చేయాలని, లేక పోతే జనవరి 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ (Aarogyasri) సేవలను నిలిపివేస్తామని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రైవేటు ఆస్పత్రులు తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. జనవరి 10 నుంచి ఆరోగ్య సేవలు నిలిచిపోతయానే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.